నిషేధిత గుట్కాలను తరలిస్తున్న ఇద్దరిని అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి కదిరికి ద్విచక్రవాహనంపై 12 వేల రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కాలను అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గుట్కాలను స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రంగడు తెలిపారు.
నిషేధిత గుట్కాల అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్టు - నిషేదిత గుట్కా అక్రమ రవాణా తాజా వార్తలు
వాహనాలు తనిఖీలు చేస్తున్న అనంతపురం జిల్లా పోలీసులకు నిషేధిత గుట్కాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి నుంచి గుట్కాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిషేధిత గుట్కా అక్రమ రవాణా ఇద్దరు అరెస్టు