అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు.. వ్యసనాలకు అలవాటు పడి దొంగలుగా మారారు. విలాసాల కోసం ద్విచక్రవాహనాలు ఎత్తుకెళ్లేవారు. అనంతపురం జిల్లాలోనే కాకుండా కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లాలోనూ వీరు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
THEFT: అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు... 21 బైక్‌లు స్వాధీనం - ananthapuram district crime
అనంతపురం జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద ఉన్న బైక్‌లను దొంగిలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 21 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు
వాహనాల విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప వివరించారు. ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇదీ చదవండి.