అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలంలోని ఉపాధిహామీ కార్యాలయంలో రెండు కంప్యూటర్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఉదయం కార్యాలయానికి వెళ్లిన సిబ్బందికి కంప్యూటర్లు కనిపించకపోవడంతో ... ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నా... కంప్యూటర్లు పోయాయని ఏపీఓ శివకుమార్ తెలిపారు. అందులో కూలీలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఉన్నాయని, తెలిసిన వారే కంప్యూటర్లను ఎత్తుకెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై ఉపాధి హామీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉపాధిహామీ కార్యాలయంలో రెండు కంప్యూటర్లు చోరీ - బేలుగుప్పలో ఉపాధిహామీ కార్యాలయం తాజా వార్తలు
ఉపాధిహామీ కార్యాలయంలోని కంప్యూటర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధిహామీ కార్యాలయంలో రెండు కంప్యూటర్లు చోరీ