ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి - heavy rain in orvakonda mandal

ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగు పాటుకు రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి.

పిడుగుపాటుకు మృతి చెందిన ఎద్దులు
పిడుగుపాటుకు మృతి చెందిన ఎద్దులు

By

Published : May 26, 2020, 7:14 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శేక్షనుపల్లి గ్రామంలో పిడుగుపాటుకు జనార్ధన్ నాయుడు అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు మృతి చెందాయి.

గ్రామంలో భారీ వర్షం పడగా.. చెట్టు కిందకు ఎద్దులను తీసుకుని వెళ్లాడు. కాసేపటికే పిడుగుపడి ప్రమాదం జరిగింది. తమకు ఉన్న జీవన ఆధారం కోల్పోయమని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

ABOUT THE AUTHOR

...view details