తెదేపా నాయకుడి చీనీ తోటను ధ్వంసం చేసిన దుండగులు
తెదేపా నాయకుడి చీనీ తోటను దుండగులు ధ్వంసం చేశారు. తోటను తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. వైకాపా కార్యకర్తలే దుశ్చర్యకు పాల్పడి ఉంటారని ఆయన ఆరోపించారు.
trees-cuting-tdp-leader
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చెన్నమల్లెపల్లిలో తెదేపా నాయకుడుకి చెందిన చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు.గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు చంద్రశేఖర్ నాయుడుకు చెందిన చీనీ తోటలో సుమారు50కి పైగా చెట్లను సోమవారం రాత్రి నరికివేశారు.విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి గ్రామానికి చేరుకుని తోటను పరిశీలించారు.వైకాపా నేతలే ఘటనకు పాల్పడి ఉంటారని ఆరోపించారు.రైతుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.