ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులు దురుసుగా వ్యవహరించారని.. వ్యాపారుల ఆందోళన - హిందుపురంలో దురుసుగా ప్రవర్తించిన ట్రాఫిక్ పోలీసులు

పోలీసులు దురుసుగా ప్రవర్తించారని హిందుపురంలో వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలను నేల పాలు చేశారని ఆరోపించారు. పోలీసులకు, వ్యాపారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

traders agitation in hindupuram
traders agitation in hindupuram

By

Published : May 28, 2021, 5:21 PM IST

అనంతపురం జిల్లా హిందూపురంలో ట్రాఫిక్ పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారని కూరగాయల వ్యాపారులు .. వారితో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై అడ్డంగా వ్యాపారాలు చేస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు టమోటాలను నేలపాలు చేయడంతో వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ఫ్యూ కారణంగా ఉన్న కొద్ది సమయంలో కూరగాయలు అమ్ముకుంటుంటే పోలీసులు తమపై ప్రతాపం చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఒకటో పట్టణ సీఐ వారికి సర్ధిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details