Tomato: అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన నాగభూషణం 3 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. 1.50 క్వింటాళ్లను అనంతపురంలో విక్రయించేందుకు గురువారం వాహనంలో తరలించారు. మంచి ధర కోసం 2రోజులు ఎదురు చూశారు. ఒక్కో ట్రే (15 కిలోల బాక్సు) రూ.40లోపే పలికింది. రవాణా ఖర్చులూ దక్కక పోవడంతో శనివారం అక్కంపల్లి సమీపంలో రోడ్డు పక్కన పారబోశారు. చుట్టుపక్కల పని చేసే కూలీలు, స్థానికులు వాటిని తీసుకెళ్లారు.
Tomato: చెమటోడ్చి పండించి.. ధరలేక నేలపాలు చేసి
Tomato: నారుపోసి... నీరుపెట్టి... అప్పులు తెచ్చి మరీ పంట పండించినా... రైతుకు మిగిలింది కన్నీరే. ఎన్నో కష్టాలకోర్చి సాగు చేసిన టమాటాకు సరైన ధర దక్కకపోవడంతో ఆ అన్నదాతకు ఆవేదనే మిగిలింది. మార్కెట్‌కు తెచ్చిన సరకును కడుపుమండి పారబోయాల్సి వచ్చింది.
ధరలేక వృథాగా టమాట