ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 9, 2021, 8:16 PM IST

ETV Bharat / state

కరోనా వస్తే రక్షించే పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు లేవు: మధు

కొవిడ్​ను కంట్రోల్ చేయడంలో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. వైరస్ బాధితులను పట్టించుకోని ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. కరోనా వైరస్ వస్తే ఈ ప్రభుత్వాలు రక్షించే పరిస్థితిలో లేవన్నారు.

సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు
సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు

కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. అనంతపురంలో సీపీఎం నిర్వహిస్తున్న కొవిడ్ ఐసోలేషన్ సెంటర్​ను మధు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ వస్తే ఈ ప్రభుత్వాలు రక్షించే పరిస్థితిలో లేవన్నారు. వైరస్ విజృంభించిన అమెరికాతో పాటు పలు దేశాలు ప్రజలకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేసి రెండో దశను ధీటుగా ఎదుర్కొన్నాయని, వాటిని చూసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోలేదన్నారు.

సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలకు రక్షణ చర్యలు చేపట్టాలనే ఆదేశాలిచ్చాకనే.. కేంద్ర ప్రభుత్వం స్పందించిందని మధు వ్యాఖ్యానించారు. వైరస్ బాధితులను పట్టించుకోని ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. కరోనా వైరస్​ను కట్టడి చేసిన దేశాలన్నీ వైద్య ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవటం వల్లనే సాధ్యమైందన్నారు. వ్యాక్సినేషన్ విధానం మార్పుచేసి, కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకునేలా పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై గళం వినిపించాలని మధు కోరారు.

ఇదీ చదవండీ... YSR Bima: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!

ABOUT THE AUTHOR

...view details