ఒక్క చిత్రం అనేక భావాలను కదిలిస్తుందంటారు.అలాంటి ఘటనే అనంతపురంలో చోటుచేసుకుంది.సీమలోని కరువు రక్కసిని ఈ ఒక్క ఘటన లక్షల గొంతుకలుగా వినిపించింది.మూడు రోజుల పాటు పూజానైవేద్యాలందుకున్న గణనాథుడి నిమజ్జనానికి మాత్రం..గంగమ్మ లేకుండా పోయింది.దీంతో అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని పెన్నా నదిలోని కంపచెట్లలోనే వినాయక విగ్రహాన్ని వదిలివేశారు.ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉండేది.కాని ఇప్పుడు అదే కరువైంది.నీరు వచ్చాకే,వినాయకుడు నిమజ్జనం అవుతారని గ్రామస్తులు అంటున్నారు.నీటి కొరత దుస్థితి ఇప్పటి వరకు తమకే ఉందని,ఇక నుంచి తమ బాధను దేవుడూ పంచుకోవల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాపమా..! శాపమా..! నిజమజ్జనానికి నీళ్లెక్కడా..! - పెన్నానది
రాష్ట్రంలో ఓవైపు వరదలు చుట్టుముట్టేస్తోంటే, మరోవైపు కరువు విలయతాండవం చేస్తోంది. అనంతపురంలో జిల్లా రొద్దం మండలంలో వినాయకుడి నిమజ్జనానికి నీరు లేక, కంపచెట్లలోనే ప్రతిమను వదిలివేసిన దయనీయమైన ఘటన చోటుచేసుకుంది. ఇది పాలకుల పాపమో..! ప్రకృతి శాపమో..!
there-is-no-water-to-do-ganesh-immersion-at-ananathapur