అనంతపురం జిల్లా కనేకల్లులోని చెరువు కట్ట వద్దనున్న అయ్యప్పస్వామి ఆలయంలో దొంగలు పడ్డారు(Theft in Kanekallu Ayyappa Swami Temple). అయ్యప్ప స్వామి మూల విరాట్టుతో పాటు హుండీ సొమ్మును దొంగలు దోచుకెళ్ళారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన కనేకల్లులో కలకలం రేపింది. సుమారు 50కిలోల బరువైన అయ్యప్ప స్వామి(50Kgs Panchaloha Ayyappa vigraham was stolen) పంచలోహ విగ్రహాన్ని దుండగులు ఎత్తికెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
హుండీ తాళాలు పగులగొట్టి అందులో ఉన్న సుమారు 50 వేల నగదు, కానుకలు దోచుకెళ్ళారని ఆలయ అర్చకులు తెలిపారు. అయితే.. ఆలయంలోని కల్యాణమండపంలో భక్తులు నిద్రిస్తున్న సమయంలోనే చోరీ జరగడం గమనార్హం. ఆలయం.. ఊరి బయట చెరువు కట్ట కింద ఉండడంతో దొంగలు చోరీ చేయడానికి మార్గం సులువైందని చెబుతున్నారు.