అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున 3గంటల సమయంలో... నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి తాళిబొట్టు దొంగిలించడానికి... దుండగులతో కలిసి ప్రయత్నించిన ఓ మహిళ గాయాలపాలైంది. జిల్లాలోని సూగేపల్లి గ్రామంలో సరోజమ్మ అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్లడానికి దుండగులు యత్నించారు. ఈ గొడవలో చోరీకి యత్నించిన మహిళకు గాయాలయ్యాయి. అంతకు ముందు అదే ఇంట్లో బీరువా పగలగొట్టి అందులో ఉన్న రూ.10వేల నగదు తీసుకెళ్లినట్లు, అనంతరం బంగారు గొలుసులు చోరీకి ప్రయత్నించినట్టు సరోజమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెల్లవారుజామున మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నం - దొంగతనానికి ప్రతిఘటించిన మహిళకు గాయాలు
అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో... నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి తాళిబొట్టు దొంగిలించడానికి దుండగులతో కలిసి ప్రయత్నించిన మహిళ గాయాలపాలైంది.
మహిళ నుంచి గొలుసు చోరీ యత్నం.. ప్రతిఘటించిన మహిళకు గాయాలు