ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్థులు - The villagers who blocked the MLA
తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లి ప్రజలు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని అడ్డుకున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.
అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లి, గొల్లపల్లి ప్రజలు తాగునీటి సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డుకు అడ్డంగా ఖాళీ బిందెలను పెట్టి కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. వేసవి కాలం రాగానే వారానికి ఒక రోజు నీటిని సరఫరా చేస్తే తమ పరిస్థితి ఏంటని స్థానికులు ఆయనను ప్రశ్నించారు. మండల పరిషత్, సచివాలయ సిబ్బంది సర్ది చెప్పినా గ్రామస్థులు వినిపించుకోలేదు. సత్యసాయి పథకం ద్వారా క్రమం తప్పకుండా నీటిని సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు సూచిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.