ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో బీడీ కార్మికుల కమ్యూనిటీ భవనం కూల్చివేత - officers demolished the Beedi workers community hall in Kadiri

అనంతపురం జిల్లా కదిరిలో బీడీ కార్మికుల కోసం నిర్మించిన కమ్యూనిటీ భవనం కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం అధికారులు ఈ భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. దీనిపై కార్మికుల నిరసన చేపట్టగా.. తెదేపా నేత కందికుంట వెంకటప్రసాద్ మద్దతు తెలిపారు.

Beedi workers protest
బీడీ కార్మికుల నిరసన

By

Published : May 30, 2021, 8:23 PM IST

అనంతపురం జిల్లా కదిరి నిజాంవలీ కాలనీలో బీడీ కార్మికుల కోసం నిర్మించిన కమ్యూనిటీ భవనం కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు దశాబ్దాలుగా బీడీ కార్మికులు తమ సామగ్రిని అక్కడే భద్రపరచుకుంటూ, సమావేశాలు ఇతర కార్యక్రమాలకు భవనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం బీడీ కార్మికుల కోసం నిర్మించిన సామూహిక భవనాన్ని అధికారులు కూల్చివేయాలనుకున్నారు. అందులో భాగంగా హిటాచి ఇతర వాహనాలతో భవనాల కూల్చివేతకు సిద్ధమయ్యారు.

బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్​చార్జి కందికుంట వెంకటప్రసాద్ కార్మికులకు మద్దతుగా నిరసనకు దిగారు. బీడీ కార్మికులకు ఉపయోగకరంగా ఉన్న సామూహిక భవనాన్ని కూల్చవద్దని అర్బన్ హెల్త్ సెంటర్ మరోచోట నిర్మించాలని డిమాండ్ చేశారు. అలా సాధ్యంకాని పక్షంలో బీడీ కార్మికుల సంఘం నాయకుల మద్దతుతో కమ్యూనిటీ భవనం నిర్మించాకే పాతది కూల్చివేయాలని డిమాండ్ చేశారు. మూడు నెలల్లో బీడీ కార్మికుల సామూహిక భవనం నిర్మించి ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details