వినాయక చవితి పండగను శాంతియుతంగా జరుపుకుందామని ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు అన్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వినాయక మండపాల ఏర్పాటు దృష్ట్యా సాధారణ జీవన విధానానికి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఉత్సవ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. నిమజ్జన సమయంలో వినాయకుడి ప్రతిమలను ఎక్కడ నిమజ్జనం చేయాలి.. చేపట్టాల్సిన చర్యలను సంబంధిత శాఖలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తెలిపారు. కదిరి డీఎస్పీ లాల్ అహమ్మద్, మాజీ ఎంపీ నిజాముద్దీన్, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
'వినాయక చవితిని శాంతియుతంగా జరుపుకుందాం' - కదిరి
అనంతపురం జిల్లా కదిరిలో శాంతి కమిటీ సమావేశంలో వినాయక చవితి పండగను శాంతియుతంగా జరుపుదామని ఉత్సవ కమిటీ సభ్యుల అన్నారు. నిమజ్జన సమయంలో ఊరేగింపు రోజున రాకపోకలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఉత్సవ కమిటీ