తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల చౌక బియ్యం డిపోలపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ఆరోపిస్తూ.. అనంతపురం జిల్లా హిందూపురంలో తేదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగా తెదేపా సానుభూతిపరుల చౌక ధాన్య డిపోలపై విజిలెన్స్ దాడులు చేయించి నిర్దాక్షిణ్యంగా వాటిని తొలగిస్తున్నారని ఆరోపించారు. జప్తు చేసిన చౌక ధాన్య డిపోలను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం ఇచ్చారు.
హిందూపురంలో తెదేపా నాయకుల నిరసన - హిందూపురంలో తెదేపా నిరసన వార్తలు
అనంతపురం జిల్లా హిందూపురంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ తెదేపా సానుభూతిపరుల చౌక బియ్యం డిపోలను జప్తు చేస్తోందని ఆరోపించారు.
తెదేపా నిరసన