ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 8, 2021, 6:23 PM IST

ETV Bharat / state

18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇవ్వాలంటూ.. తెదేపా నిరసనలు

రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో దశ విలయ తాండవం చేస్తోన్న తరుణంలో అందరికీ వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం ఎదుట తెదేపా శ్రేణులు ప్లకార్డులు చేతబట్టి నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని నినాదాలు చేశారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

tdp protest in anantapuram
tdp protest in anantapuram

జగన్ సర్కారు కక్ష సాధింపుతో కాకుండా ప్రజా సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అర్బన్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

తెదేపా అధినేతపై కేసును ఖండిస్తున్నాం..

చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారంటూ... అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చంద్రబాబు సూచనలు చేస్తే ఆయనపై కేసు నమోదు చేశారని.. ఈ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని తెదేపా క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ నేత ఉమామహేశ్వర నాయుడు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

విధుల్లో నిర్లక్ష్యం.. నోడల్ అధికారిపై కలెక్టర్ చర్యలు

ABOUT THE AUTHOR

...view details