ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''అన్నా క్యాంటీన్లు తెరవండి.. పేదల ఆకలి తీర్చండి''

రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలంటూ... అనంతపురం జిల్లా మడకశిరలో తెదేపా కార్యకర్తలు ధర్నా చేశారు.

అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడి ఆకలి తీర్చండి

By

Published : Aug 3, 2019, 6:59 PM IST

అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడి ఆకలి తీర్చండి

అనంతపురం జిల్లా మడకశిరలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని మూతపడిన క్యాంటీన్ల ముందర తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ ప్లేట్లతో 5 రూపాయల నాణెంతో శబ్దం చేస్తూ.... మూతపడిన అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించాలని నినాదాలు చేశారు. 15 రూపాయలకే 3 పూటల భోజన పథకాన్ని మాజీ సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని మూసివేసి ఉపాధి కోసం పట్టణానికి వచ్చి పని చేసుకునే వారి కడుపు కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదర్శనగా బయలుదేరి తహశీల్దారు కార్యాలయంలో అర్జీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details