లోకేశ్ పాదయాత్రపై స్పందించిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్ Payyavula Keshav comments on yuvagalam: ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే చంద్రబాబు పర్యటనలపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం.. పవన్ కల్యాణ్, లోకేశ్ చేపట్టబోయే బస్సు యాత్ర, పాదయాత్రను దృష్టిలో ఉంచుకొని జీవోె నం.1 కొనసాగించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే.
వైఎస్సార్ ప్రభుత్వం.. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను అమలు పరిచే ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ నెల 27న నారా లోకేశ్ చేపట్టబోయే యువగళంపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. లోకేశ్ పాదయాత్రను చేపట్టి తీరుతామని వెల్లడించారు.
జీవో-01, జీవో-10: ప్రజా సమస్యల ప్రస్తావన, టీడీపీ భావజాలాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడమే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర అజెండా అని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దిల్లీ నడి వీధిలో ర్యాలీ తీస్తే.. జగన్ గల్లీల్లో సైతం తిరగడానికి వీల్లేదని అంటున్నారని ధ్వజమెత్తారు. జీవో-01, జీవో-10లు తమ కార్యక్రమాలను నియంత్రించ లేవని తేల్చిచెప్పారు. చంద్రబాబు సభలకు లక్షలాది మంది హాజర అవుతున్నారని, అలాగే లోకేష్ పాదయాత్రకూ అంతే స్పందన లభిస్తుందన్నారు. టీడీపీ శ్రేణులన్నీ పాదయాత్రలో పాల్గొనేందుకు ఉత్సాహాంతో ఉన్నాయని తెలిపారు. ప్రతిపక్షానికి ఇబ్బందులు సృష్టించడం ద్వారా ప్రజా సమస్యలు చర్చకు రానివ్వకుండా చేసే ప్రయత్నం అధికార పార్టీ చేస్తోందని మండిపడ్డారు.
'ఈ నెల 27 తేదీ నుంచి నారా లోకేశ్ కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. లోకేశ్ చేపట్టే పాదయాత్రలో యువకులు పాల్గొనేందుకు ముందుకువస్తున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజా వ్యతిరేకతను, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చంద్రబాబు సభకు వచ్చే ప్రజలను చూస్తే అర్థం అవుతుంది. లోకేశ్ ప్రజా సమస్యలపై స్పందించేందుకు వస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం ద్వారా వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కొనసాగుతుంది.' - పయ్యావుల కేశవ్, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్
ఇవీ చదవండి: