ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే.. విధ్వంసాలే ఎక్కువ'

అనంతపురం జిల్లాలోని రాప్తాడు అభివృద్ధిని.. వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు నెలవుగా మారుస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కంటే వైకాపా నేతలు చేసిన విధ్వంసాలే ఎక్కువని విమర్శించారు.

paritala sunitha
'వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధికంటే విధ్వంసాలే ఎక్కువ'

By

Published : Dec 16, 2020, 7:58 PM IST


ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కంటే వైకాపా నేతలు చేసిన విధ్వంసాలే ఎక్కువని మాజీమంత్రి పరిటాల సునీత విమర్శించారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు అభివృద్ధిని.. కక్షసాధింపు చర్యలకు నెలవుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధి తెదేపా హయాంలో జరిగిందనే విషయం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గుర్తించాలని హితవు పలికారు. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తే.. వైకాపా నేతలు ప్రతి ఊరిలోనూ విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఐదేళ్లలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.21 కోట్లు తాము అందిస్తే, వైకాపా ఎంతమందికి సాయం చేసిందని నిలదీశారు. రూ.217కోట్లతో 3,257 ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేస్తే.. వైకాపా ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా వేయలేదని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details