TDP Leader Jc Prabhakar: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రశాంతత నెలకొల్పి.. పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడిపత్రిలోని జేసీ ఇంటి నుంచి గాంధీ విగ్రహం వరకు కార్యకర్తలతో కలిసి నల్లదుస్తులు ధరించి పాదయాత్ర నిర్వహించారు. తాడిపత్రిని అభివృద్ధి చేయటానికి తాము ప్రయత్నిస్తుంటే వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తమపై రాళ్లదాడి చేయిస్తున్నారంటూ జేసీ ధ్వజమెత్తారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్నానదిలో బోర్లు వేయించి తాగునీటి సమస్య పరిష్కరిస్తుంటే ఓర్చుకో లేక అడ్డుకుంటున్నారని విమర్శించారు. మురుగు నీటి పారుదల వ్యవస్థను అధునీకరిస్తుంటే వైసీపీ కార్యకర్తలతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు.
తాడిపత్రిని ప్రశాంతంగా ఉండనివ్వండి.. నల్ల దుస్తులతో జేసీ నిరసన - Tadipatri
Jc Prabhakar Reddy: తాడిపత్రిలో ప్రశాంతత నెలకొల్పలాని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడిపత్రిని అభివృద్ధి చేయాలని చూస్తోంటే వైసీపీ ఎమ్మెల్యే తమపై రాళ్ల దాడి చేయిస్తున్నారంటూ ఆరోపించారు. తాడిపత్రి పట్టణంలో శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి