అనంతపురం జిల్లా హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి, మంత్రి పదవిని చేపట్టి, రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందిన నాయకుడిని ఇలా విమర్శించి మాట్లాడడం సరికాదని హితవు పలికారు . 43 వేల కోట్ల అవినీతికి పాల్పడి జైలులో గడిపి వచ్చిన మీ నాయకుడు మీకు ఎక్కువ అయితే... ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసిన మా నాయకుడు మాకు ఎక్కువేని, ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. ఇలాంటివి పునరావృతం అయితే ప్రతి కార్యకర్త తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు.
లోకేష్‌ని విమర్శించడం సరికాదు: ఎంఎస్ రాజు - ఈటీవీ భారత్ తాజా వార్తలు
తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని, అనంతపురం జిల్లా హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం అయితే ప్రతి కార్యకర్త తిరగబడాల్సి వస్తుందని తెలిపారు.
'మీ నాయకుడు మీకు ఎక్కువ అయితే మా నాయకుడు మాకు ఎక్కువ'