రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మంచిదే అయినప్పటికీ.. దాని ఆచరణ సరిగ్గా లేదని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పర్యటించిన ఆయన.. వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా కాకుండా.. ఎన్నికల్లో ఓట్లు వేయించేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారని విమర్శించారు. కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెదేపా నాయకులు అంతా కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
వాలంటీర్ వ్యవస్థను తీసేయాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి - ఏపీ వాలంటీర్ వ్యవస్థపై తాజా వార్తలు
వాలంటీర్ల వ్యవస్థపై జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రంలో వాలంటీర్లను తీసేయాలని డిమాండ్ చేశారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి
TAGGED:
volunteer system in ap