అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గృహనిర్బంధం - మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గృహనిర్బంధం
TDP Leaders Hosue Arrest: అనంతపురం జిల్లాలో తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని అనంతపురంలో గృహనిర్బంధం చేశారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, రైతు సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో నేడు కలెక్టరేట్ వద్ద ధర్నాకు తెదేపా జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.
TDP call protest at Ananthapur: తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పోలీసులు అనంతపురంలో గృహనిర్బంధం చేశారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రైతు సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నాకు తెదేపా జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ప్రభాకర్ చౌదరిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే .. పోలీసుల ద్వారా హక్కులను హరించడం వైకాపా ప్రభుత్వ పాలనకు నిదర్శనమని ప్రభాకర్‌చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలు పరిష్కరించకుండా సీఎం జగన్ జిల్లాకు ఏ విధంగా వస్తారని ప్రశ్నించారు. ప్రజలకు సమధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమవుతుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని అణచివేయడం సరికాదని హెచ్చరించారు. ఏది ఏమైనా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తీరుతామని స్పష్టం చేశారు.