ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ , ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి ఖాళీ ప్లేట్లతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఎంతోమంది పేద విద్యార్థుల ఆకలి తీరుస్తున్న మధ్యాహ్న పథకాన్ని రద్దు చేయడం సరికాదన్నారు. కార్పొరేట్ కళాశాలలకు వెన్నుదన్నుగా నిలవడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని.. లేనిపక్షంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతపురంలో విద్యార్థి సంఘాల ఆందోళన - rally
ప్రభుత్వ కళాశాలలో రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
విద్యార్థుల నిరసన