అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలంటూ... విద్యార్థులు ఆందోళన చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మద్ధతు తెలిపారు. పట్టణంలోని జాతీయ రహదారిపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు పూర్తయినా... ఇప్పటివరకు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా గెస్ట్లెక్చర్స్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో రాకపోకలకు అంతరాయం కలగటంతో... పోలీసులు విద్యార్థి నాయకులను ఠాణాకు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థుల ఆందోళన - Kadiri
కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థులు ఆందోళన చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా... విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థుల ఆందోళన