అనంతపురానికి చెందిన బీటెక్ విద్యార్థి సోహైల్ హుస్సేన్ (21), ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సోహైల్ హుస్సేన్ ఆదివారం తన మిత్రులతో కలిసి పామురాయి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో ఈతకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలో చిక్కుకున్నట్లు అతని స్నేహితులు తెలిపారు. ఎంతసేపు గాలించిన తన మిత్రుడు ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో యువకుని మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి బీటెక్ విద్యార్థి మృతి - అనంతపురం ముఖ్యంశాలు
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన అనంతపురం రూరల్ పామురాయిలో జరిగింది. పోలీసులు.. గజ ఈతగాళ్ల సహాయంతో యువకుడి మృతదేహన్ని తీశారు. యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి బీటెక్ విద్యార్థి మృతి