ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Black fungus in AP: బ్లాక్ ఫంగస్ కు బీటెక్ విద్యార్థి బలి..! - btech student death

బ్లాక్ ఫంగస్ తో అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతూ చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

black fungus death
బ్లాక్ ఫంగస్ కు బీటెక్ విద్యార్థి బలి

By

Published : May 30, 2021, 6:41 AM IST

అనంతపురానికి చెందిన సాయి ప్రసాద్ అనే బీటెక్ విద్యార్థి.. బ్లాక్ ఫంగస్ తో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సాయి ప్రసాద్ కు ఈనెల 13న కరోనా పాజిటివ్ అని ఫలితం వచ్చింది. అనంతపురంలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించి బ్లాక్ ఫంగస్ సోకింది. మెరుగైన వైద్యం కోసం బంధువులు.. వారం రోజుల క్రితం అతడిని తిరుపతి స్విమ్స్ కు తరలించారు.

స్విమ్స్ లో చికిత్స పొందుతూ.. విద్యార్థి శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని కొడిమి గ్రామానికి తరలించి శనివారం అంతక్రియలు నిర్వహించారు. విద్యార్థి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ABOUT THE AUTHOR

...view details