ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పండువగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి గరుడ సేవ - గరుడ సేవ

కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి గరుడ వాహనాన్ని అధిరోహించి... తిరుమాడవీధుల్లో ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ సేవ తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీదేవీ-భూదేవీ సమేత స్వామి సుందరరూపంలో భక్తకోటికి దర్శనమిచ్చారు.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి గరుడ సేవ

By

Published : Mar 21, 2019, 7:46 AM IST

శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి గరుడ సేవ
అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు.. స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడి ఉత్సవమూర్తులను నేత్రపర్వంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మగరుడ వాహనంపై స్వామివారిని అధిష్టింప చేసి తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అర్చకులు రాజగోపురం ఎదుట పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భజనలు, ప్రత్యేక కీర్తనలు పాడుతూ భక్తజన బృందాలు సాగాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details