అనంతపురం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి సందడి కనిపిస్తోంది. పెనుకొండ రామాలయంలో ఇవాళ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు.
sreeramanavami
By
Published : Apr 13, 2019, 10:44 PM IST
పెనుకొండలో శ్రీరామనవమి సందడి
అనంతపురం జిల్లా పెనుకొండ లోని మారుతీనగర్ మిట్టాంజనేయస్వామి దేవాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉట్ల పరుష కనుల పండుగలా సాగింది. వేడుకల్లో భాగంగా.. డప్పు చప్పుళ్లతో చిన్నారులు ఊరేగింపుగా ఆలయానికి వచ్చారు. నవమి పండగ సందర్భంగా.. ఆలయ పరిసర ప్రాంతాల్లో జాతర వాతావరణం కనిపించింది.