ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"రాష్ట్రంలో పొత్తుల్లేవ్" - special status yatra

ప్రత్యేక హోదా ఇచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర ప్రారంభించిన రఘువీరా రాహుల్​ను ప్రధాని చేయడమే లక్ష్యమని అన్నారు.

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

By

Published : Feb 19, 2019, 10:30 PM IST

Updated : Feb 20, 2019, 12:06 AM IST

ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరిట కాంగ్రెస్ బస్సు యాత్ర చేపట్టింది.

ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని మామిళ్ళపల్లి నుంచి ఈ యాత్రను ప్రారంభించారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన హామీలనే నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. అయిదేళ్లు పూర్తయినా రాజధాని నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడం..రాష్ట్రంపై కక్షసాధింపేనని విమర్శించారు. పింఛనుపై పార్టీలు మోసపూరిత హామీలు ఇస్తున్నారన్న రఘువీరా..ఎన్నికల ముందు మాత్రమే రైతులు, యువత గుర్తుకు వస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని..సొంతంగానే పోటీచేస్తామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని అన్నారు.
Last Updated : Feb 20, 2019, 12:06 AM IST

ABOUT THE AUTHOR

...view details