అనంతపురం జిల్లాలో వేరుశెనగ విత్తనాలు కోసం రైతుల ఆందోళనలు ఆగడం లేదు. కొన్ని రోజులుగా పరిస్థితి ఇలాగే కొనసాగుతున్నా.. అధికారుల్లో మార్పు రావడం లేదు. విత్తనాల కోసం అర్ధరాత్రి నుంచే రైతులు కేంద్రాల వద్ద నిరీక్షించారు. ఇవాళ పలు గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలిరావటంతో... విత్తనాలు తగినంత లేవని అధికారులు చేతులెత్తేశారు. ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని రైతులను కోరారు. కానీ వారు శాంతించలేదు. దీంతో రైతులు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విత్తనాలు ఇచ్చే వరకూ కదిలేది లేదని కర్షకులు పట్టుబట్టారు.
ఇవి కూడా చదవండి:
'వేరుశెనగ' కోసం రైతుల ఆందోళనలు - వేరుశనగ విత్తనాలు
వేరుశెనగ విత్తనాలు ఇప్పించాలని అనంతపురం జిల్లాలోని విత్తన కేంద్రాల వద్ద రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధికారుల సమాధానాలకు ఆగ్రహించిన రైతులు... జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
'వేరుశనగ' కోసం రైతుల ఆందోళనలు