అనంతపురం నగరంలోని మునిసిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న తన కొడుకు హర్షవర్ధన్ నిత్యం కొడుతున్నాడని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కుమారుడు కొడుతున్నాడని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రెండు నెలల నుంచి చిత్రహింస పెడుతున్నా.. కొడుతున్నా.. మౌనంగా భరించానని లక్ష్మి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంట్లోకి రానీయకుండా చేస్తున్నాడని, ఉన్న ఆస్తిని అమ్మేస్తూ జల్సాలు చేయొద్దని చెప్పినందుకు తన కుమారుడు ఇష్టం వచ్చినట్లు చావ బాదుతున్నాడని బాధితుడు లక్ష్మీనారాయణ కన్నీటి పర్యంతమయ్యాడు. కుమారుడి చేష్టలు శృతిమించడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అయితే రెండు నెలలుగా పోలీస్ ల చుట్టూ తిరుగుతున్నా.. న్యాయం చేయలేదని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.