అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం మామిళ్ళపల్లిలో నారాయణస్వామి అనే వ్యక్తిని ఆయన కుమారుడు గణేష్, కోడలు దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటిలో నిద్రపోతున్న నారాయణస్వామిపై గణేష్ కొడవలితో దాడి చేశాడు. హత్యకు గణేష్ భార్య సహకరించింది. తీవ్రగాయాలతో నారాయణస్వామి మృతి చెందారు. నారాయణస్వామికి ఇద్దరు కుమారులు కాగా గణేష్ చిన్న కుమారుడు.
ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు
ఆస్తి విషయంలో కన్న తండ్రినే హత్యచేశాడో కిరాతకుడు. భార్యతో కలిసి తండ్రిని కొడవలితో దారుణంగా చంపాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా మామిళ్ళపల్లిలో జరిగింది. హత్య అనంతరం నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి నారాయణస్వామి మామిళ్ళపల్లికి వచ్చారు. నర్సరీ వ్యాపారం చేస్తూ నారాయణస్వామి జీవనం సాగిస్తున్నారు. తనకు ఆస్తి ఇవ్వలేదని గణేష్ తండ్రితో గొడవ పడ్డాడని, తండ్రిని అడ్డు తప్పిస్తే ఆస్తి దక్కుతుందని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఘటనాస్థలిని పరిశీలించారు. హత్యానంతరం నిందితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి :151 మందిని గెలిపిస్తే.. ఏం చేస్తున్నారు?: పవన్