అనంతపురం జిల్లాలో తొలివిడత ఎన్నికలు జరిగే కదిరి డివిజన్లో ఆరు గ్రామ పంచాయతీల్లో వైకాపా మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది. పలుచోట్ల తెదేపా అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు తీవ్ర వత్తిడి తెచ్చినప్పటికీ ఎక్కడా లొంగలేదు. నల్లమడ మండలం చెర్లోపల్లిలో వైకాపా మద్దతుతో నామినేషన్ వేసిన అభ్యర్థి ఏకగ్రీవం అయినప్పటికీ, అక్కడ తెదేపా మద్దతున్న అభ్యర్థితో మూడేళ్లే కొనసాగే ఒప్పందం చేసుకున్నారు. రెండో విడత ఎన్నికలు జరుగుతున్న ధర్మవరం డివిజన్లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నేటి నుంచి నామపత్రాల పరిశీలన కొనసాగనుంది.
మెుదటి విడత ఇలా..
అనంతపురం జిల్లాలో వైకాపా నేతల పాచికలు పారలేదు. గ్రామ పంచాయతీల్లో తెదేపా మద్దతుదారులైన సర్పంచి అభ్యర్థులను బెదిరించినప్పటికీ ఎక్కడా తగ్గకుండా అన్నిచోట్లా పోటాపోటీగా నిలిచారు. తొలివిడత ఎన్నికలు జరిగే కదిరి డివిజన్లో గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ డివిజన్లో 169 సర్పంచి స్థానాలుండగా ఆరుచోట్ల తెదేపా అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవటంతో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సర్పంచి స్థానాలకు 1093 నామినేషన్లు దాఖలు చేయగా, వీటిలో 112 మందివి తిరస్కరణకు గురయ్యాయి. ఉపసంహరణకు ముందు 893 మంది అభ్యర్థులను అర్హులుగా తేల్చగా, ఉపసంహరణల అనంతరం 465 మంది సర్పంచి అభ్యర్థులుగా పోటీలో మిగిలారు.
రెండో విడత ఇలా..
రెండో విడత ఎన్నికలు జరిగే ధర్మవరం డివిజన్లో 307 సర్పంచి స్థానాలుండగా, 2992 వార్డులున్నాయి. వీటికి పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయటానికి గురువారంతో గడువు పూర్తైంది. పలుచోట్ల తెదేపా మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగారు.
మనస్థాపంతో పురుగుల మందు తాగి..