పట్టు రీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనంతపురం జిల్లా హిందూపురంలో చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. సీపీఐ ఆధ్వర్యంలో పట్టుగూళ్ల మార్కెట్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు . ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పట్టు రీలర్లకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. డీలర్లకు ఇన్సెంటివ్, నష్టపరిహారం చెల్లించాలని అలాగే కార్మికులకు కేటాయించిన స్థలంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తాహసిల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం అందించారు.
పట్టు రీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన - హిందూపురం తాజా వార్తలు
పట్టు రీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం స్పందించి పట్టు రీలర్లకు న్యాయం చేయాలని సీపీఐ నాయకులు కోరారు. లేనిపక్షంలో ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు.
పట్టు రీలర్ల సమస్యలు పరిష్కరించాలి