ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 12, 2021, 5:51 PM IST

ETV Bharat / state

వాలంటీర్​ విధులకు రాజీనామా.. సర్పంచిగా నామినేషన్

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్​కు ఈరోజు చివరిది కాగా.. పలువురు అభ్యర్థులు తరలివచ్చారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం శెట్టిపల్లి గ్రామ వాలంటీర్ శ్యామల నామపత్రం దాఖలు చేశారు. గోనిపేటలో తలారి నాగరాజు అనే దివ్యాంగుడు నామినేషన్ వేశాడు.

settypalli volunteer resigned and filed nominations as sarpanch
శెట్టిపల్లి వాలంటీర్​గా రాజీనామా చేసి సర్పంచిగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం శెట్టిపల్లిలో శ్యామల అనే గ్రామ వాలంటీర్.. తన విధులకు రాజీనామా చేశారు. సర్పంచి అభ్యర్థిగా పెనుగొండలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు ఆమె నామినేషన్ వేశారు. గోనిపేట సర్పంచ్ అభ్యర్థులుగా వినోద్ నాయక్, తలారి నాగరాజు అనే దివ్యాంగుడు నామ పత్రాలు దాఖలు చేశారు.

నామినేషన్ స్వీకరణకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో.. నామ పత్రాలు దాఖలు చేయడానికి అభ్యర్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. నామినేషన్ కేంద్రాన్ని పెనుగొండ సబ్ కలెక్టర్ నిషాంతి సందర్శించి.. అభ్యర్థులకు సహకరించాలని సహాయ కేంద్రం సిబ్బందికి సూచించారు. నామినేషన్ల స్వీకరణ గురించి అధికారులను ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details