అనంతపురం జిల్లా నార్పలలోని కోటవీధిలో పది సంవత్సరాల బాలుడిపై వరాహం దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ తరహా ఘటలు చాలా జరిగాయని స్థానికులు తెలిపారు. పందుల యజమానులపై చర్యలు తీసుకోవాలని... పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరాహం దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా నార్పల కోటవీధిలో వరాహం దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
వరాహం దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు