ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Harrasment: పాఠశాల విద్యార్థులకు సచివాలయ ఉద్యోగి వేధింపులు - అనంతపురంలో పాఠశాల విద్యార్థులకు సచివాలయ ఉద్యోగి వేధింపులు వార్తలు

అనంతపురం జిల్లా తనకల్లు మండలం చీకటిమానిపల్లిలోని సచివాలయ ఉద్యోగి.. ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థినుల పట్ల.. అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని బాధిత విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు తెలపగా.. వారు సచివాలయ ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Secretariat employee harassed school students at chikatimanipally at ananthapur
పాఠశాల విద్యార్థులకు సచివాలయ ఉద్యోగి వేధింపులు

By

Published : Oct 2, 2021, 3:32 PM IST

అనంతపురంలోని సచివాలయంలో ఇంజినీరింగ్ సహాయకుడిగా పని చేస్తున్న యువకుడు.. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. యువకుడికి దేహశుద్ధి చేశారు.

జిల్లాలోని తనకల్లు మండలం చీకటిమానిపల్లిలో జరిగిన ఈ ఘటనపై.. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటిమానిపల్లి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్​గా పని చేస్తున్న అమర్నాథ్ అదే యువకుడు.. సచివాలయం ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కొందరు విద్యార్థినుల పట్ల కొద్ది రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అతడి ప్రవర్తనతో విసుగెత్తిన విద్యార్థులు.. సమస్యను తల్లిదండ్రులకు తెలిపారు. ఇదే విషయమై తల్లిదండ్రులు, గ్రామస్తులు.. పాఠాశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు ఇతర ఉపాధ్యాయులకు, సచివాలయ ఉద్యోగులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అమర్నాథ్ ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో శుక్రవారం సాయంత్రం.. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు సచివాలయం వద్దకు చేరుకొని యువకుడిని చితకబాదారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని నిలదీసి.. ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ హామీ ఇచ్చారు. అనంతరం సచివాలయ ఉద్యోగిపై.. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

clean andhra: స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details