అర్హులకు అవకాశం ఇచ్చి...
కదిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌లను వినియోగించుకునేందుకు ఈనెల 5న కదిరిలో 7న అనంతపురంలో అవకాశం ఇచ్చారు. అర్హులైన ఉద్యోగులందరికీ ఈ అవకాశం కల్పించారు. కదిరి ఆర్డీఓ కార్యాలయం నుంచి కోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగుల ఇళ్లకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపారు.
మళ్లీ మళ్లీ పంపారు
క్షుణ్నంగా పరిశీలించి అర్హులైన ఉద్యోగులకే పంపాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 31మందికి రెండోసారి పోస్టల్ బ్యాలెట్‌లు పంపారు.
అనంతలో పోస్టల్ బ్యాలెట్‌కు రెండోసారి అవకాశం! - పోస్టల్ బ్యాలెట్
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఉద్యోగులకు రెండోసారి అవకాశం కల్పించారన్న అంశం అనంతపురం జిల్లా కదిరిలో చర్చనీయాంశమైంది.
కదిరిలో పోస్టల్ బ్యాలెట్ కలకలం
చర్యలకు సిఫార్సు
ఈ విషయం తెలుసుకున్న అజయ్ కుమార్ యంత్రాంగం, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో సమావేశమయ్యారు. రెండోసారి పోస్టల్ బ్యాలెట్లు పంపిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆర్ఓ నివేదిక పంపారు