ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఈబీ తనిఖీలు.. భారీగా మద్యం, నగదు పట్టివేత - గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మద్యం పట్టివేత వార్తలు

అనంతపురం జిల్లా హిందూపురంలో ఎస్ఈబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తూముకుంట చెక్ పోస్ట్ వద్ద ఎటువంటి ఆధారంలేెని రూ. 14 లక్షల 98 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గోరంట్ల మండలం చెట్ల మారంపల్లి వద్ద అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోనూ రూ.21లక్షల విలువ చేసే అక్రమ మద్యం పట్టుబడింది.

SEB officials
ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈబీ తనిఖీలు

By

Published : Feb 11, 2021, 7:28 PM IST

Updated : Feb 11, 2021, 9:53 PM IST

అనంతపురం జిల్లా హిందూపురంలో అక్రమ మద్యం, నగదు పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. హిందూపురం గ్రామీణ మండలం తూముకుంట చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కారులో ఎటువంటి ఆధారంలేెని రూ. 14 లక్షల 98 వేల నగదు పట్టుబడిందని తెలిపారు. అయితే ఈ నగదు హిందూపురం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలోని కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు తరలిస్తున్నట్లుగా సంబంధిత వ్యక్తి అధికారులకు వివరించాడు.

గోరంట్ల మండలం చెట్ల మారంపల్లి వద్ద అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆటోను సీజ్ చేశామని పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోనూ..

చిలకలూరిపేట పట్టణంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు హైదరాబాద్ నుంచి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. బస్తాల మాటున రూ. 21 లక్షలు విలువ చేసే మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న లారీని సీజ్ చేశారు. పట్టుబడిన సరకు చిలకలూరిపేటకు చెందిన జెట్టి రామకృష్ణ , ముత్యాల మణికంఠకు చెందినదిగా గుర్తించారు. వీరు ఓ ప్రజా ప్రతినిధికి చెందిన కుటుంబ సభ్యుడితో కలిసి కొంతకాలంగా వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. వాహన డ్రైవర్లు సర్దార్, షేక్ జానీ బాషాను అధికారులు అరెస్ట్ చేశారు.

రామకృష్ణ, మణికంఠలు కొంత కాలంగా అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారని ఎస్ఈబీ నరసరావుపేట సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సర్ఫ్ బస్తాల మాటున ఖరీదైన మద్యం సీసాలను తరలిస్తున్నారని తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు అక్రమ మద్యాన్ని అడ్డుకున్నామని వివరించారు. ఇందులో రామకృష్ణ, మణికంఠను ఏ1, ఏ2 లుగా కేసు నమోదు చేశామన్నారు. అక్రమ వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారో దర్యాప్తు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

తండ్రితో నామపత్రాలు దాఖలు చేయించి.. తనువు చాలించాడు!

Last Updated : Feb 11, 2021, 9:53 PM IST

For All Latest Updates

TAGGED:

SEB news

ABOUT THE AUTHOR

...view details