అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని అనంతపురం జిల్లా పరిగిలో ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. మండలంలోని చెర్లోపల్లి వద్ద మద్యం ప్యాకెట్లను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 192 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం ఎవరైన రవాణా చేస్తే.. వారిపై కఠిన చర్యలు తప్పవని పరిగి పోలీసులు హెచ్చరించారు.
చెర్లోపల్లి వద్ద 192 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టివేత - చెర్లోపల్లి వద్ద ఎస్ఈబీ అధికారుల సోదాలు
అనంతపురం జిల్లా పరిగి మండలంలో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 192 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
చెర్లోపల్లి వద్ద 192 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టివేత