సాధారణంగా మేకల చెవులు 10 నుంచి 15 సెంటీమీటర్లలోపే పొడవుంటాయి... కానీ ఈ సరోహి జాతి మేకల చెవులు మూడు రెట్లకు పైగా పొడుగుంటాయి. దాదాపు 45 సెంటీమీటర్ల పొడవు, 12 సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఈ రకం మేకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
చెవులు ఒక్కటే కాదు... సరోహి మేకలకు ఎన్నో భిన్నమైన లక్షణాలున్నాయి. ఇవి రెండు నుంచి మూడు లీటర్ల పాలిస్తాయి. సాధారణ మేకలు ఒకటి లేదా రెండు పిల్లలకు జన్మనిస్తాయి... సరోహి ఒకే ఈతలో నాలుగు పిల్లల్నిస్తాయి. ఎదుగుదలలోనూ ఈ మేకలు ముందుంటాయని కాపరులంటున్నారు.