Sand shortage in Anantapur district : అనంతపురం జిల్లాలో ఇసుక కొరత అక్రమార్కులకు డబ్బు సంపాదన మార్గాలను ఏర్పరచింది. లాక్ డౌన్‌తో ఎక్కడికక్కడ ఆగిపోయిన నిర్మాణాలు మళ్లీ ఊపందుకున్నాయి. దీనికి తోడు జగనన్న శాశ్వత గృహనిర్మాణ పథకం అమలు చేస్తున్నందున .. అన్నిచోట్లా నది నుంచి తీసుకొచ్చే ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ కొరతను అధిగమించటానికి రోబో శాండ్ ను తయారు చేయాలని ఇంజనీరింగ్ నిపుణులుల ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నారు. కంకర రాళ్లను క్రమ పద్దతిలో ఇసుక రేణువులుగా మార్చి, ప్రత్యేక జల్లెడ ద్వారా రోబోశాండ్ ను తయారు చేస్తున్నారు. ఈ కృత్రిమ ఇసుక నిర్మాణాలు నదీ ఇసుక కంటే పటిష్టంగా ఉంటాయి. అయితే ఈ ఇసుకలో కంకర డస్ట్ కలిపి విక్రయాలు చేస్తుండటం ప్రమాదంగా మారుతోంది. ఇసుక దొరకక పోవటంవల్లనే కృత్రిమ ఇసుక కొనుగోలు చేస్తున్నట్లు భవన యజమానులు చెబుతున్నారు.
ఇళ్లు కట్టడానికి మొదలు పెట్టినప్పటి నుంచి ఇసుకకు రేటు పెరిగింది. కొనుగోలు చేయలేకపోతున్నాం. దాని బదులు డస్టును వాడుతున్నాం. లైఫ్ టైం తక్కువ అని చెబుతా మాకు తప్పట్లేదు. ఇసుక ఎటుపోతుందో అర్థం కావట్లేదు. -సూర్యనారాయణ, భవన యజమాని