కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని అధికారులు పదే పదే చెబుతున్నా జనం మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. నిత్యవసర సరకులు కొనుగోలు తదితర పనుల కోసం వచ్చిన వారితో అనంతపురం జిల్లా ధర్మవరం వీధులు కిక్కిరిసాయి. పట్టణంలో ఇప్పటికే 1200 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా విజృంభిస్తున్నా వీడని నిర్లక్ష్యం... విచ్చలవిడిగా సంచారం... - ధర్మవరంలో ప్రజల నిర్లక్ష్యం
అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనా విజృంభిస్తున్న ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కరోనా కేసులు రోజు రోజకూ పెరిగిపోతున్నా.. భౌతిక దూరం పాటించకుండా బయట తిరుగుతున్నారు.
అనంతపురం జిల్లా ధర్మవరం రద్దీ
నిత్యావసర దుకాణాలు రోజు మార్చి రోజు తెరుస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు మాత్రమే తెరుస్తున్నందున.. గురువారం వేల మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎన్టీఆర్ సర్కిల్ మెయిన్ బజార్ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. జనం రద్దీ అధికంగా ఉన్నందున కరోనా భయంతో పలువురు వ్యాపారస్తులు దుకాణాలు బంద్ చేశారు.
ఇదీ చదవండి : కొవిడ్ ఆస్పత్రుల్లో.. వైద్యుల నియామకానికి ఉత్తర్వులు జారీ