అనంతపురం జిల్లాలోని పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు..ఆర్డీటీ సంస్థ, స్పెయిన్ దేశస్థుడు జువాన్ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. పట్టణంలో ప్రారంభమైన పరుగులో 15 మంది స్పెయిన్ దేశస్థులు, 10 మంది జిల్లావాసులు పాల్గొన్నారు. బుక్కరాయసముద్రం, శింగనమల, నార్పల మండలాల మీదుగా తెల్లవారుఝామున పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చేరుకున్నారు. వారికి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. 170 కిలోమీటర్లు పరుగు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఒక్కో కిలోమీటరుకు ఒక పేద విద్యార్థిని దత్తత తీసుకోవడం సహా పేదలకు ఇళ్లు నిర్మించేందుకు దాతల సహకారం తీసుకుంటామని చెప్పారు.
జై జువాన్.. సాయానికో పరుగు..!
పేద ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా అనంతపురంలో.. ఆర్డీటీ సంస్థ, స్పెయిన్ దేశస్థుడు జువాన్ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 15 మంది స్పెయిన్ దేశస్థులు పాల్గొన్నారు. 170 కిలోమీటర్ల ఈ రన్లో... ఒక్కో కిలోమీటరుకు ఒక పేద విద్యార్థిని దత్తత తీసుకుంటారు.
run-for-poor-people-in-ananthapuram
Last Updated : Jan 25, 2020, 2:48 PM IST