ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్నేహితుల చేతిలో.. ఆర్టీసీ బస్సు డ్రైవర్​​ హతం - ధర్మవరం తాజా వార్తలు

ధర్మవరం శివార్లలో నాగేంద్ర అనే ఆర్టీసీ బస్సు డ్రైవర్​ను అతని స్నేహితులు హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో జరిగన గొవడలో జరిగన ఘటనగా భావిస్తున్నారు. నాగేంద్ర స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

rtc driver murdered in dharmavaram city outskirts
హత్యకు గురైన ఆర్టీసీ డ్రైవర్​

By

Published : May 5, 2020, 2:48 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ శివార్లలోని మేడాపురం గేటు వద్ద నాగేంద్ర (30) అనే వ్యక్తి సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్​గా పని చేసిన నాగేంద్ర... మెదక్ నుంచి పని నిమిత్తం ధర్మవరం వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా స్నేహితులు తారసపడ్డారు.

మద్యం కొనుగోలు చేసిన వారు రైల్వే గేటు వద్ద ఉన్న గుట్టలో తాగేందుకు వెళ్లారు. అక్కడ నాగేంద్రతో గొడవ పడ్డట్టుగా తెలుసుతోంది. ఈ క్రమంలోనే.. అతని స్నేహితులు బండరాళ్లతో దాడి చేసి హతమార్చారని ధర్మవరం పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగేంద్ర స్నేహితుల కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details