ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలులో వృద్ధ దంపతుల వద్ద 14.4 తులాల బంగారం చోరీ - robbery on the train

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. బెంగళూరు నుంచి ముంబయి వెళ్లే నాగర్​కోయిల్​ ఎక్స్​ప్రెస్​ రైల్లో ప్రయాణిస్తోన్న వృద్ధ దంపతుల వద్ద నుంచి దాదాపు 14.4 తులాల బంగారం చోరీ చేశారు. ఘటనపై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలులో దొంగల బీభత్సం... 14.4 తులాల బంగారం స్వాహా

By

Published : Oct 22, 2019, 9:25 PM IST

Updated : Oct 28, 2019, 8:26 AM IST

రైలులో దొంగల బీభత్సం... 14.4 తులాల బంగారం స్వాహా

అనంతపురం జిల్లా గుంతకల్లులో దొంగలు బీభత్సం సృష్టించారు. బెంగళూరు నుంచి ముంబయి వెళ్లే నాగర్​ కోయిల్​ ఎక్స్​ప్రెస్​ రైల్లో వృద్ధ దంపతుల వద్ద 14.4 తులాల బంగారం దోచుకెళ్లారు. గుంతకల్లులోని రామస్వామి కాలనీకి చెందిన లక్ష్మయ్య, విశాలాక్షి దంపతులు బెంగళూరు నుంచి గుంతకల్లు వచ్చేందుకు నాగర్​ కోయిల్​ ఎక్స్​ప్రెస్​ రైల్లోని ఎస్​-4 బోగీలో ప్రయాణించారు. రైలు స్టేషన్​కు చేరుతుండగా నిద్ర లేచిన వారు శౌచాలయానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసే సరికి వారి బ్యాగులోని బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై వారు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Oct 28, 2019, 8:26 AM IST

ABOUT THE AUTHOR

...view details