Robbery in Anjaneya Swamy Temple: హుండీ నగదు కాజేసిన ఆలయ చీఫ్ ససెక్యూరిటీ ఆఫీసర్.. సీసీ ఫుటేజీతో అడ్డంగా బుక్కైన వైనం.. Robbery in Anjaneya Swamy Temple: కంచే చేను మేస్తే అన్న చందంగా తయారయింది కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పరిస్థితి. దేవస్థానంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి తెల్లవారుజామున అభిషేకం సమయంలో ఆలయంలోనికి ప్రవేశించి ఆలయంలోని హుండీలలో 8 పర్యాయాలు నగదు దొంగతనానికి పాల్పడ్డాడు. చోరీ విషయంపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆలయ అధికారులు ఈ ఘటనపై పరిశీలనలు చేపట్టారు.
Theft CC Footage: అమ్మవారి ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
ఈ క్రమంలో తెల్లవారుజామున నమోదైన సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కృష్ణారెడ్డి పలుమార్లు ఆలయ హుండీలో చేయి పెట్టి నగదు చోరీచేసి.. తన ప్యాంటు జేబులో పెట్టుకుంటున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో అతడిని వెంటనే విధుల నుంచి తొలగించిన ఆలయ అధికారులు కసాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీని ఇతరుల పేరుపై నిర్వహిస్తూ 20 సంవత్సరాలుగా ఆలయంలో పాగా వేసిన కృష్ణారెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లలో రచ్చరచ్చ.. వింజామర చోరీ
ఈ చోరీపై తనకేమీ తెలియదు అంటూ మొదట్లో బుకాయించాడని, అయితే సీసీ కెమెరాలో దృశ్యాలు స్పష్టంగా ఉండటంతో అతడిని విధుల నుంచి తొలగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రావణమాసం పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి హనుమాన్ దర్శన్ యాత్ర కోసం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆంజనేయునిపై అపారమైన విశ్వాసంతో నమ్మకంగా భక్తులు హుండీలలో చెల్లించుకున్న ముడుపులు ఇలా చోరీకి కావడం భక్తాదుల మనోభావాలను దెబ్బతీస్తోంది.
వారిద్దరూ ఆలయంలో చోరీ చేయబోయారు.. సరిగ్గా అప్పుడే..!
ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలు.. సులభంగా చేయి పెట్టి డబ్బులు దొంగలించే విధంగా ఉండటంతో భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆలయంలో హుండీలో నగదు చోరీ ఘటనలు ఎంతకాలం నుంచి జరుగుతోంది, ఇంకా ఎంతమంది దొంగల ప్రమేయం ఉందన్న అనుమానాలు రేకెత్తున్నాయి. దేవస్థాన చీఫ్ సెక్యూరిటీ అధికారి చోరీకి పాల్పడుతుంటే అక్కడే పూజలు నిర్వహిస్తున్న అర్చకులకు, ఇతర సిబ్బందికి ఈ విషయం తెలుసా..?లేక తెలిసీ కూడా ఊరికే ఉండిపోయారా..?అన్నది విచారణలో తేలాల్సి ఉంది.
క్షమించమని దండం పెట్టి కాళీమాత నగలు ఎత్తుకెళ్లిన దొంగలు
ఈ నెల రోజులపాటు తెల్లవారుజాము సమయంలో భక్తాదులు లేని సమయంలో ఇంకా ఏమైనా చోరీలకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ చేపట్టారు. అందుబాటులో ఉన్న కాలం మొత్తం సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆలయ ఈవో వెంకటరెడ్డి వెల్లడించారు.