దానిమ్మ లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ముందు చక్రం పగిలిపోవడంతో... అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన కూలీలందరూ డి.హిరేహాల్ మండలం గొడిసేలపల్లి గ్రామానికి చెందినవారు. ఘటనా స్థలానికి చేరుకొన్న డి. హిరేహాల్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టైర్ పేలి బొలేరో బోల్తా... ముగ్గురికి తీవ్ర గాయాలు - అనంతపురం జిల్లా క్రైం న్యూస్
అనంతపురం జిల్లా రాయదుర్గం-బళ్లారి ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. డి.హిరేహాల్ మండలం హడగాలి గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
టైరు పేలి బొలేరో బోల్తా... ముగ్గురికి తీవ్ర గాయాలు