అనంతపురం జిల్లా నార్పల మండలం హెచ్ సోదనపల్లి గ్రామానికి చెందిన గుట్టూరు ధనుష్ కుమార్ .. బి పప్పూరు బాలుర గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. బాలుడి మేనమామ అయిన కుల్లాయప్ప బాలుడిని స్కూల్లో చూసి.. కూల్ డ్రింక్ తాగించడానికి దగ్గరలో ఉన్న గ్రామంలోకి ద్విచక్రవాహనంపై వెళ్లారు. అక్కడ కూల్ డ్రింక్ తాగి వస్తుండగా.. వెనక వైపు నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బాలుడు బస్ కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడి అక్కడికి అక్కడికక్కడే మృతి చెందాడు.
మేనమామతో సరదాగా వెళ్లి వస్తుండగా.. - అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలుడి పేరు ధనుష్ కుమార్. స్కూల్ దగ్గర తన మేనమాన కనిపించాడు. ఎండ బాగా ఉండటంతో కూల్ డ్రింక్ తాగడానికి తీసుకెళ్లాడు. ఇంతలోనే ప్రమాదం బస్సు రూపంలో వచ్చి ఆ బాలుడి జీవితాన్ని చిదిమేసింది. అసలేమైందంటే..
road accident
బాలుడి మేనమామకి కాలు విరగడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:తెలుగు బిడ్డకు సర్వోన్నత గౌరవం